ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. తన స్వింగ్‌తో భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకోగా.. బుమ్రా కూడా తను ఉన్నానంటూ సత్తా చాటాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న లియామ్ లివింగ్‌స్టోన్ (15)ను బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన స్లో ఆఫ్ కట్టర్‌ను అంచనా వేయలేకపోయిన లివింగ్‌స్టోన్.. బంతిని మిస్సయ్యాడు.
దాంతో ఆఫ్‌స్టంప్ చివర తగిలిన బంతి లివింగ్‌స్టోన్‌ను పెవిలియన్ చేర్చింది. దీంతో ఇంగ్లండ్ జట్టు ఐదు ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 27 పరుగులతో నిలిచింది.