అబుధాబి: బంగ్లాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ధాటిగా ఆడుతున్నారు. 125 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు జోస్ బట్లర్ (18), జేసన్ రాయ్ (23 నాటౌట్) జట్టుకు శుభారంభం అందించారు. త్వరగా వికెట్ కోసం బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా బంతిని షకీబల్ హసన్‌కు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది.
అయితే నాసుమ్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్లో జట్టు స్కోరు 39 వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించిన బట్లర్ లాంగాఫ్‌లో నయీమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జేసన్రాయ్తోపాటు డేవిడ్ మలన్ (1) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్లిద్దరూ ధాటిగా ఆడటంతో 6 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.