అబుధాబి: ఓపెనర్ జేసన్ రాయ్ (61) ధాటికి బంగ్లాదేశ్ జట్టు విలవిల్లాడింది. అతని వికెట్ ఎలా తీయాలో తెలియక బంగ్లా బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు షారిఫుల్ ఇస్లామ్ అతన్ని అవుట్ చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. విజయానికి జట్టు అడుగు దూరంలో ఉండగా అతను అవుటవగా మిగతా బ్యాట్స్‌మెన్ లాంఛనాన్ని పూర్తి చేశారు.
దీంతో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో మరో 35 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. రాయ్‌తోపాటు మరో ఓపెనర్ జోస్ బట్లర్ (18), డేవిడ్ మలన్ (28 నాటౌట్), జానీ బెయిర్‌స్టో (8 నాటౌట్) రాణించారు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టు.. బ్యాట్స్‌మెన్ అందరూ రాణించడంతో 14.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసింది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, నాసుమ్ అహ్మద్ చెరో వికెట్ కూల్చారు.