అబుధాబి: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అదరగొడుతున్నారు. జోస్ బట్లర్ (18)తోకలిసి జట్టుకు శుభారంభం అందించిన జేసన్ రాయ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 28 బంతుల్లోనే 5 ఫోర్లు 1 సిక్సర్‌తో 44 పరుగులు చేసిన అతను అర్థశతకం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. బట్లర్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్ (17 నాటౌట్) నుంచి అతనికి మంచి సహకారం అందుతోంది.
దీంతో వికెట్ల కోసం బంగ్లా బౌలర్లు చెమటోడుస్తున్నారు. బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా ఎంత మంది బౌలర్లను మార్చినా వికెట్ మాత్రం దక్కలేదు. మొత్తానికి 10 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి 60 బంతుల్లో ఇంకా 35 పరుగులు కావలసి ఉంది.