Virat Kohli | ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గింది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆరు పరుగులతో విజయం సాధించింది. దాదాపు 18 సంవత్సరాల నిరీక్షణకు తెర దించుతూ తొలిసారిగా టైటిల్‌ను సాధించింది. ఈ విజయంతో జట్టు సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఆ తర్వాత పంజాబ్ జట్టుకు శుభారంభం లభించినా.. ఆ తర్వాత తడబడింది. ముఖ్యంగా ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా పంజాబ్‌ను ఇబ్బందిపెట్టాడు. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి వరకు పంజాబ్‌ను గెలిపించేందుకు ప్రయత్నించినా అదృష్టం కలిసిరాలేదు. మ్యాచ్ గెలిచాక విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Read Also : IPL Prize Money | ఐపీఎల్ విజేత ఆర్సీబీకి దక్కిన ప్రైజ్‌మనీ ఎంత..? ఎవరిని ఏ అవార్డులు వరించాయంటే..?
గతంలో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా.. కప్ మాత్రం దక్కలేదు. ఈ సారి మాత్రం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అత్తుత్యమ ప్రదర్శన చేసి టైటిల్‌ను సాధించింది. మ్యాచ్ తర్వాత విరాట్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని ఆర్సీబీ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. జట్టులో తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ విజయం జట్టు సభ్యులతో పాటు 18 సంవత్సరాలు మద్దతు నిలిచిన ఆర్సీబీ అభిమానులదని.. తన యవ్వనం జట్టుకు ధారపోశానని, అనుభవం, విధేయతను జట్టుకు అంకితం చేశానని.. ఈ క్షణమే తనకు సర్వసమని విరాట్ పేర్కొన్నాడు. తన హృదయం, ఆత్మ రెండూ బెంగళూరుతోనే ఉన్నాయని.. తాను జట్టుకే విధేయుడిగా ఉన్నానని.. వేరే ఆలోచనలు వచ్చినా.. తాను వారితోనే ఉన్నానని.. వారు సైతం తనతోనే ఉన్నారన్నారు. ఈ విజయంలో గత కొన్నేళ్లు తనతో పాటు కలిసి ఆడిన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ సైతం సంబరాలు చేసుకునేందుకు అర్హులేనని పేర్కొన్నాడు. ఇద్దరు జట్టు కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశాడు విరాట్. ఈ మ్యాచ్ ప్రత్యేకమవుతుందని.. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఏబీతో అన్నానని.. అతనితో కలిసి సంబరాలు చేసుకోవాలని భావించినట్లు చెప్పాడు.
Read Also : Virat Kohli | కోహ్లీ 18 ఏండ్ల కల సాకారం.. భావోద్వేగానికి లోనైన దిగ్గజ క్రికెటర్
ఎన్నోసార్లు ఏబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించాడని.. నాలుగేళ్ల కిందట రిటైర్ అయినా అతని ప్రభావం జట్టుపై ఎప్పుడూ ఉంటుందని.. క్రిస్ గేల్ సైతం చాలా సీజన్స్ ఆర్సీబీ తరఫున ఆడాడని.. అందుకే నాతోపాటు వీరిద్దరూ ఈ విజయానికి అర్హులని భావిస్తున్నట్లు విరాట్ చెప్పుకొచ్చాడు. తన మనసంతా బెంగళూరుతోనే ఉంటుందని.. ఐపీఎల్లో తన చివరి రోజు వరకు ఆర్సీబీ తరఫునే ఆడతానని జట్టుకు చెప్పానని తెలిపాడు. అయితే, తాను ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండాలనుకోనని.. 20 ఓవర్లు మైదానంలో ఉంటూ ప్రభావం చూపించాలనుకుంటానని.. తాను అలాంటి మనస్తత్వం కలిగిన ఆటగాడినని.. తనకు జట్టు మేనేజ్మెంట్ ఇచ్చిన మద్దతును మరిచిపోలేనని తెలిప్పాడు. జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారని.. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లే స్టార్ ఉన్నార చెప్పాడు. ఈ సమయంలో తాను ఎక్కువగా మాట్లాడలేనని.. ఆటగాళ్లతోపాటు కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్స్ చేసుకోవడం బాగుందని.. నా కెరీర్లో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు. ఇప్పటికీ టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. ఈ ఫార్మాట్‌ను గౌరవంగా చూడాలని యువ క్రికెటర్లకు విరాట్ సూచించాడు.