హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : హెచ్సీఏ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. హైదరాబాద్ క్రికెట్ క్లబ్ అవకతవకల వ్యవహారాన్ని విచారించేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం సీఐడీ అధికారులకు హెచ్ఏసీ కేసు వివరాలు ఇవ్వాలని లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు సమర్పించాలని కోరింది.
సీఐడీ నుంచి వివరాలు రాగానే కేసు నమోదు చేసి ఈడీ అధికారులు సైతం దర్యాప్తు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురిని సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకోబోతుందనే దానిపై ఉతంఠ నెలకొంది.