Durand Cup 2023 | రెచ్చిపోయిన ఈస్ట్ బెంగాల్ ఫ్యాన్స్.. ప్రత్యర్థి మద్దతుదారులపై ఇటుకలతో దాడి
Durand Cup 2023 : డ్యురాండ్ కప్‌లో కోల్‌కతాకు చెందిన ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్(East Bengal FC) ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్(Northeast United FC) అభిమానులపై ఇటుకలు విసిరేశారు. అంతేకాదు వాళ్లను ఉద్దేశిస్తూ జాతి వివక్ష(Racism) పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ సెమీఫైనల్లో విజయం సాధించిన అనంతరం ఈ...
Durand Cup 2023 : డ్యురాండ్ కప్‌లో కోల్‌కతాకు చెందిన ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్(East Bengal FC) ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్(Northeast United FC) అభిమానులపై ఇటుకలు విసిరేశారు. అంతేకాదు వాళ్లను ఉద్దేశిస్తూ జాతి వివక్ష(Racism) పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ సెమీఫైనల్లో విజయం సాధించిన అనంతరం ఈ సంఘటన జరిగింది. చివరి వరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు పెనాల్టీ షూటౌట్(Penalty Shootout)లో గెలుపొందింది. తమ క్లబ్ గెలవడంతో సంబురాల్లో మునిగి పోయిన ఫ్యాన్స్ ప్రత్యర్థి జట్టు అభిమానులపై దాడికి పాల్పడ్డారు.
ఇటుకులు విసరడమే కాకుండా వాళ్లను జాతి వివక్షపూరిత పదాలతో దూషించారు. దాంతో, అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి నార్త్ ఈస్ట్ క్లబ్ అభిమానులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించారు. అంతేకాదు ఆందోళనకు కారణమైన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే… ఈ మొత్తం వ్యవహారానికి రాజా గుహ(Raja Guha) అనే ఈస్ట్ బెంగాల్ అభిమాని కారణమని తెలుస్తోంది. ఈరోజు రెండో సెమీఫైనల్లో ఎఫ్‌సీ గోవా(FC Goa), మొహున్ బగన్ సూపర్ జెయింట్(Mohun Bagan Super Giant) జట్లు తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
Asia cup 2023 | పసికూనపై సెంచరీతో విరుచుకుపడిన పాక్ బ్యాటర్లు.. నేపాల్ ముందు కొండంత లక్ష్యం
Babar Azam | నేపాల్‌పై సూపర్ సెంచరీ.. లారా, వార్నర్ రికార్డు సమం చేసిన బాబర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

