Babar Azam | నేపాల్‌పై సూపర్ సెంచరీ.. లారా, వార్నర్ రికార్డు సమం చేసిన బాబర్
Babar Azam : ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) దిగ్గజాల సరసన చేరాడు. ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో అతను వన్డేల్లో 19వ శతకం సాధించాడు. దాంతో, వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా(Brian Lara), శ్రీలంక వెటరన్ మహేల జయవర్దనే(Mahela Jayawardene), ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్...
Babar Azam : ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) దిగ్గజాల సరసన చేరాడు. ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో అతను వన్డేల్లో 19వ శతకం సాధించాడు. దాంతో, వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా(Brian Lara), శ్రీలంక వెటరన్ మహేల జయవర్దనే(Mahela Jayawardene), ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner)తో సమానంగా నిలిచాడు. అంతేకాదు పాకిస్థాన్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ప్రస్తుతానికి సయీద్ అన్వర్(Saeed Anwar) 20 సెంచరీలతో అగ్ర స్థానంలో ఉన్నాడు.
ఆసియా కప్ ఆరంభ పోరులో నేపాల్‌పై పాక్ సారథి విరుచుకుపడ్డాడు. కష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన ఈ స్టార్ బ్యాటర్ 109 బంతుల్లోనే వందకు చేరువయ్యాడు. ఆసియా కప్‌లో బాబర్‌కు ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. అతడి కంటే ముందు షాహీద్ ఆఫ్రీదీ, షోయబ్ మాలిక్ ఈ టోర్నీలో మూడంకెల స్కోర్ సాధించారు.
Century No.1️⃣9️⃣ for the top-ranked ODI batter 🫡
Excellent knock from the 🇵🇰 captain 👏#PAKvNEP | #AsiaCup2023 pic.twitter.com/QqfeGakZyO
— Pakistan Cricket (@TheRealPCB) August 30, 2023
అయితే.. విధ్వంసక ఆల్‌రౌండర్ ఆఫ్రీదీ 2010లో రెండు శతకాలు బాదాడు. ఇప్పటికీ ఆసియా కప్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన పాక్ ఆటగాడి రికార్డు అతడి పేరిటే ఉంది. ఈసారి బాబర్ ఆ రికార్డును బ్రేక్ చేసేలా ఉన్నాడు. ఈ ఏడాది వరల్డ్ నంబర్ 1 ప్లేయర్‌గా నిలిచిన బాబర్ సూపర్ ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
Rizwan Run Out | అనూహ్యంగా రనౌటైన పాక్ ఓపెనర్.. అందుకే హెల్మెట్ పెట్టుకోవాలంటూ అశ్విన్ కామెంట్
US Open 2023 | మాజీ చాంపియన్ అరుదైన రికార్డు.. 21 ఏళ్ల తర్వాత అతనొక్కడే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

