US Open 2023 | మాజీ చాంపియన్ అరుదైన రికార్డు.. 21 ఏళ్ల తర్వాత అతనొక్కడే
US Open 2023 : యూఎస్ ఓపెన్(US Open 2023)లో మాజీ చాంపియన్ స్టాన్ వావ్రింకా(Stan Wawrinka) అరుదైన రికార్డు నెలకొల్పాడు. తొలి రౌండ్ విజయంతో 21 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. దాంతో 1992 తర్వాత ఈ టోర్నీలో గెలుపొందిన అతి పెద్ద వయస్కుడి(the oldest man)గా వావ్రింక గుర్తింపు...
US Open 2023 : యూఎస్ ఓపెన్(US Open 2023)లో మాజీ చాంపియన్ స్టాన్ వావ్రింకా(Stan Wawrinka) అరుదైన రికార్డు నెలకొల్పాడు. తొలి రౌండ్ విజయంతో 21 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. దాంతో 1992 తర్వాత ఈ టోర్నీలో గెలుపొందిన అతి పెద్ద వయస్కుడి(the oldest man)గా వావ్రింక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 38 ఏళ్ల ఐదు నెలలు. 1992లో అమెరికా స్టార్ జిమ్మీ కొరన్స్(Jimmy Connors) 40 ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్‌లో గెలిచాడు. ఆ తర్వాత అతను మళ్లీ ఈ టోర్నీలో ఆడలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎవరూ అతడి రికార్డు బ్రేక్ చేయలేదు.
స్విట్జర్లాండ్‌కు చెందిన వావ్రింకా తొలి రౌండ్లో జపాన్ ఆటగాడు యొషిహిటో నిషియోక(Yoshihito Nishioka)పై విజయం సాధించాడు. కాలి గాయం వేధిస్తున్నా లెక్క చేయకుండా పోరాడిన వావ్రింకా 7-6(5) 6-2, 6-4తో గెలుపొందాడు. ‘నేను బాగా ఆడుతున్నానని అనుకుంటున్నా. కోర్టులో చురుగ్గా కదులుతున్నా. హుషారుగా కనిపిస్తున్నా.
Here it is.
Just a beauty reel of @stanwawrinka ‘s backhand. pic.twitter.com/OqzZEbjbB6
— US Open Tennis (@usopen) August 30, 2023
మూడు సెట్లలో పై చేయి సాధించడం గొప్పగా అనిపించింది. ఇదే తీరుగా ఆడితే టాప్ ప్లేయర్లను కూడా ఓడించగలనే నమ్మకం నాకుంది. అయితే.. గతంలో ఎలా ఆడాను? అనేది నేను ఆలోచించడం లేదు. జరిగిపోయిన రోజుల్ని తలచుకోవడం ఏమంత మంచి విషయం కాదు’ అని వావ్రింకా మ్యాచ్ అనంతరం తెలిపాడు.
ఇవి కూడా చదవండి
England Womens Team | ఇంగ్లండ్ క్రికెట్లో కొత్త అధ్యాయం.. ఇకపై ఇద్దరికీ మ్యాచ్ ఫీజు సమానం
ODI WC 2023 | బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. వరల్డ్ కప్ మొత్తానికి స్టార్ పేసర్ దూరం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

