ODI WC 2023 | బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. వరల్డ్ కప్ మొత్తానికి స్టార్ పేసర్ దూరం
ODI WC 2023 : ఆసియా పులులు బంగ్లాదేశ్(Bangladesh)కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ ఎబదాత్ హొసేన్(Ebadot Hossain) వరల్డ్ కప్(ODI WC 2023) లోపు ఫిట్నెస్ సాధించడం అసాధ్యమే అని తెలుస్తోంది. మోకాలి గాయం(Knee Injury)తో బాధ పడుతున్న అతను కోలుకునేందుకు కనీసం నాలుగు నెలల పైనే పట్టనుంది. దాంతో, వరల్డ్ కప్....
ODI WC 2023 : ఆసియా పులులు బంగ్లాదేశ్(Bangladesh)కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ ఎబదాత్ హొసేన్(Ebadot Hossain) వరల్డ్ కప్(ODI WC 2023) లోపు ఫిట్నెస్ సాధించడం అసాధ్యమే అని తెలుస్తోంది. మోకాలి గాయం(Knee Injury)తో బాధ పడుతున్న అతను కోలుకునేందుకు కనీసం నాలుగు నెలల పైనే పట్టనుంది. దాంతో, వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని తాజాగా బంగ్లా క్రికెట్‌బోర్డు వెల్లడించింది.
‘అవును.. ప్రపంచ కప్‌లో ఎబదాత్ హొసేన్ అందుబాటులో ఉండం లేదు. ఇది మాకు నిజంగా పెద్ద దెబ్బ. గాయం తగ్గడం కోసం హొసేన్ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. దాంతో, అతను మళ్లీ బౌలింగ్ చేసేందుకు కొంత సమయం కావాలి. కనీసం మూడు నుంచి నాలుగు నెలలు పట్టేలా ఉంది. అందుకని అతడిని వరల్డ్ కప్ పోటీలకు పరిగణించడం లేదు’ అని బంగ్లాదేశ్ చీఫ్ సెలెక్టర్ మిన్హజుల్ అబెదిన్(Minhajul Abedin) ఓ ప్రకటనలో తెలిపాడు. హొసేన్ నిరుడు వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఈ 29 ఏళ్ల పేసర్ ఇప్పటివరకూ 12 వన్డేలు ఆడాడంతే.
బంగ్లాదేశ్ జట్టు

అఫ్గనిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన హొసేన్ ఆసియా కప్ పోటీలకి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో తంజిమ్ షకీబ్(Tanzim Sakib)ను జట్టులోకి తీసుకున్నారు. ఆసియా కప్‌లో తస్కిన్ అహ్మద్ బౌలింగ్ యూనిట్‌కు సారథ్యం వహించనున్నాడు. ఆసియా కప్‌లో బంగ్లా షకిబుల్ హసన్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఆగస్టు 31న ఆతిథ్య శ్రీలంకతో బంగ్లా తలపడనుంది.
ఇవి కూడా చదవండి
Asia Cup 2023 | ఆసియా కప్ కోసం శ్రీలంక చేరుకున్న భారత జట్టు
Praggnanandhaa | ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పిన ప్రజ్ఞానంద.. ఎందుకంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

