బుధవారం 05 ఆగస్టు 2020
Sports - Jul 07, 2020 , 10:42:36

ధోనీ బర్త్‌డే.. 'హెలికాప్టర్‌ సాంగ్'‌ అదిరింది

ధోనీ బర్త్‌డే.. 'హెలికాప్టర్‌ సాంగ్'‌ అదిరింది

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సహచర క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు సోషల్‌మీడియాలో   ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌ మహీ కోసం ఓ కొత్త పాటను వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో  రూపొందించాడు.  ఇవాళ ధోనీ జన్మదినం సందర్భంగా  ‘హెలికాప్టర్‌ సాంగ్‌ ’ ను  తన  ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో  రిలీజ్ చేశాడు. ధోనీ సాంగ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

బ్రావో ఓ గొప్ప ఆల్‌రౌండర్‌ మాత్రమే కాదు.. మంచి గాయకుడు కూడా. తనే స్వయంగా పాటు రాసి వీడియోలు రూపొందిస్తాడు. ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తాడు. గతంలో అతడు రూపొందించిన  డీజే..ఛాంపియన్‌ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది.   2019 జూలై 9న ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ధోనీ తన ఆఖరి మ్యాచ్‌ ఆడాడు.  ఇప్పటికి ఏడాదవుతోంది 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo