న్యూఢిల్లీ: తనపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) విధించిన నాలుగేండ్ల నిషేధంపై స్టార్ అథ్లెట్ ద్యుతీచంద్ సవాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో ద్యుతి నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిక ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలడంతో నాడా నిషేధం వేసింది. అయితే నిషేధంపై ప్యానల్ ముందు ఆధారాలు సమర్పిస్తామని ద్యుతి ప్రతినిధి పార్థ్ గోస్వామి పేర్కొన్నారు.