అబుదాబి: శ్రీలంక యువ క్రికెటర్ దునిత్ వెల్లలగె కుటుంబంలో విషాదం నెలకొన్నది. వెల్లలగె తండ్రి సురంగ వెల్లలగె(54) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం అఫ్గానిస్థాన్‌తో శ్రీలంక మ్యాచ్ తర్వాత తన తండ్రి చనిపోయిన విషయం తెలుసుకున్న దునిత్ హుటాహుటిన స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు. దీంతో జట్టులో ఒకింత ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే సూపర్-4కు చేరుకున్న లంక జట్టుకు దునిత్ అందుబాటులో ఉండేదానిపై అస్పష్టత నెలకొన్నది.
శనివారం బంగ్లాతో తలపడనున్న లంక, 23న పాకిస్థాన్‌తో, 26న భారత్‌తో ఆడనుంది. ఇదిలా ఉంటే దునిత్ తండ్రి మృతిపై శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో అతని వెన్నంటి ఉంటామని జట్టు చీఫ్ కోచ్ సనత్ జయసూర్య ప్రకటించారు. గురువారం అఫ్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో దునిత్ బౌలింగ్‌లో మహమ్మద్ నబీ ఐదు సిక్స్‌లు కొట్టి జట్టుకు పోరాడే స్కోరు అందించిన సంగతి తెలిసిందే.