WSKL | దుబాయ్ వేదికగా ‘వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్’.. ఫిబ్రవరిలో తొలి సీజన్..!
WSKL : ఐపీఎల్ రాకతో పొట్టి క్రికెట్ దశ మారినట్టే అన్ని ఆటల రూపరేఖలు కూడా మరిపోతున్నాయి. ఇంతకుముందు మట్టికోర్టు ఆటగా పేరొందిన కబడ్డీకి ప్రో -కబడ్డీ లీగ్(PKL)తో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సాధ్యమైంది. పీకేఎల్ తరహాలోనే మరో లీగ్ ఫ్యాన్స్‌ను అలరించనుంది.
WSKL : ఐపీఎల్ రాకతో పొట్టి క్రికెట్ దశ మారినట్టే అన్ని ఆటల రూపరేఖలు కూడా మరిపోతున్నాయి. ఇంతకుముందు మట్టికోర్టు ఆటగా పేరొందిన కబడ్డీకి ప్రో -కబడ్డీ లీగ్(PKL)తో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సాధ్యమైంది. పీకేఎల్ తరహాలోనే మరో లీగ్ ఫ్యాన్స్‌ను అలరించనుంది. అయితే.. భారత గడ్డపై కాకుండా విదేశీ నేలపై ఈ లీగ్ జరుగనుంది. వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్(World Super Kabaddi League) తొలి సీజన్ దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మొత్తం 30 జట్లు పాల్గొనే ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చి మధ్యలో జరుగనుందని సమాచారం.
పీకేఎల్ విజయవంతం కావడంతో వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్ కూడా హిట్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య(IKF) కూడా పచ్చజెండా ఊపింది. దాంతో, ఎనిమిది ఫ్రాంచైజీ జట్లతో ఈ లీగ్‌ను జరపాలనే ఆలోచనతో ఉన్నారు ఆర్గనైజర్స్. ‘కబడ్డీకి ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ. అందుకే ఈ ఆటను భారత్‌లోనే కాకుండా విశ్వమంతా వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. అందుకే.. వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్‌ను నిర్వహించాలనుకుంటున్నాం.

ఈ లీగ్‌లో వరల్డ్ స్టేజిపై కబడ్డీ అనే మా లక్ష్యం నెరవేరుతుంది. ఈ టోర్నీతో ప్రతిభావంతులను వెలుగులోకి తేవడంతో పాటు ఈ ఆటకు ఒలింపిక్ గుర్తింపు కూడా తీసుకురావాలని భావిస్తున్నాం. ఎనిమిది జట్లతో జరుగబోయే తొలి ఎడిషన్ వేలంలో ఆటగాళ్లను కొనేందుకు రూ.48 కోట్ల పరిమితి విధించాలని అనుకుంటున్నాం’ అని ఎస్జే అప్లిఫ్ట్ కబడ్డీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సంభవ్ జైన్ (Sambhav Jain) వెల్లడించాడు.
Inaugural edition of World Super Kabaddi League to be held in Dubai https://t.co/Iz3WgHEJXS
— Newsd (@GetNewsd) June 30, 2025
డబ్ల్యూఎస్‌కేఎల్ ప్రతిపాదనకు పలు దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. కబడ్డీని ఎంతో ఇష్టపడే దక్షిణ కొరియా, ఇరాన్, థాయ్‌లాండ్, పాకిస్థాన్, మలేషియా, జపాన్, కెనడాలతో పాటు ఆమెరికా సైతం కొత్త లీగ్ తొలి సీజన్ కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- FIR on Boxing Coach | మైనర్ బాక్సర్‌పై లైంగిక వేధింపులు.. మహిళా కోచ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..!
- Saffron Tea | కుంకుమ పువ్వు కేవలం గర్భిణీలకే కాదు.. అందరికీ ఎంతో మేలు చేస్తుంది..!
- Nalgonda : పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో శైలజా రామయ్యర్ పూజలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

