Saffron Tea | గర్భంతో ఉన్న మహిళలు కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగాలని మన పెద్దలు చెబుతుంటారు. వైద్యులు కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంటారు. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగడం వల్ల గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలు ఆరోగ్యంగా పుడతారని వైద్యులు చెబుతుంటారు. అయితే కుంకుమ పువ్వు అనగానే కేవలం గర్భిణీలు మాత్రమే దీన్ని తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. వాస్తవానికి కుంకుమ పువ్వును అందరూ తీసుకోవచ్చు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కుంకుమ పువ్వు రెక్కలు 2 తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు 2 సార్లు తాగవచ్చు. ఇలా కుంకుమ పువ్వుతో తయారు చేసే టీని తాగుతుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కుంకుమ పువ్వు టీని సేవించడం వల్ల మన మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తి పెరుగుతుంది. డోపమైన్, సెరొటోనిన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. వీటిని మూడ్‌ను నియంత్రించే సమ్మేళనాలుగా చెబుతుంటారు. అందువల్ల కుంకుమ పువ్వుతో తయారు చేసే టీ ని తాగుతుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. కుంకుమ పువ్వులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా క్రోసిన్, క్రోసెటిన్, సఫ్రనాల్, కాంప్ఫెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధుల వంటి ప్రాణాంతక రోగాలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఈ టీని సేవిస్తుంటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా పెద్దపేగు, బ్రెస్ట్, లంగ్, ప్రోస్టేట్, బోన్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ అధ్యయనాల ద్వారా నిరూపించారు. కుంకుమ పువ్వు టీని రోజూ తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. కుంకుమ పువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తాయి. దీంతో మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. చురుగ్గా ఉంటారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ రాకుండా అడ్డుకోవచ్చు.
మహిళలకు నెలసరి సమయంలో అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. అలాంటి వారు కుంకుమ పువ్వు టీని సేవిస్తుంటే ఫలితం ఉంటుంతి. దీంతో వారికి ఉండే చిరాకు, తలనొప్పి, ఆహారంపై యావ, నొప్పులు వంటి సమస్యలు తగ్గిపోతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కుంకుమ పువ్వు టీని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు కుంకుమ పువ్వు టీని తప్పకుండా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కంటి చూపుపు పెంచుతాయి. కళ్ల సమస్యలు ఉన్నవారు కుంకుమ పువ్వు టీని తాగుతుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఇలా కుంకుమ పువ్వుతో మనం అనేక లాభాలను పొందవచ్చు.