ఫామ్‌లో లేకపోయినా భారత టెస్టు జట్టులో చాలా కాలంగా చోటు కాపాడుకుంటూ వస్తున్న ఆటగాళ్లు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ. రహానే తన బ్యాటుతో ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇషాంత్ కూడా వికెట్లు తీయడానికి చాలా తిప్పలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌లో ఆడే భారత టెస్టు జట్టులో వీళ్లిద్దరినీ టీమిండియా సెలెక్టర్లు తప్పించారు.
దీనిపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం బ్రాడ్ హాగ్ స్పందించాడు. వాళ్లిద్దరినీ జట్టులో నుంచి తప్పించడం సరైన నిర్ణయమని అన్నాడు. జట్టులో అర్ధంతరంగా మార్పులు చేయకుండా.. నెమ్మదిగా జట్టును మార్చాల్సిన ప్రాముఖ్యతను ఈ సందర్భంగా హాగ్ వివరించాడు. రహానే, ఇషాంత్‌ను తప్పించడం ద్వారా కొత్త ఆటగాళ్లకు అవకాశాలు దొరుకుతాయన్నాడు.
అంతేకాకుండా కుర్రాళ్లకు సీనియర్ ప్లేయర్లతో ఆడే అవకాశం రావడం ఎంతో ముఖ్యమని, దీని వల్ల కొత్త కుర్రాళ్లు చాలా విషయాలు నేర్చుకుంటారని చెప్పాడు.