దుబాయ్: ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్లో యువ భారత జట్టు సెమీస్కు దూసుకెళ్లింది. దుబాయ్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం భారత అండర్-19 జట్టు.. 315 పరుగుల భారీ తేడాతో మలేషియా అండర్-19 జట్టుపై రికార్డు విజయం సాధించింది.
భారత జట్టులో 17 ఏండ్ల వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (125 బంతుల్లో 209 నాటౌట్, 17 ఫోర్లు, 9 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగగా వేదాంత్ త్రివేది (90) తృటిలో సెంచరీ కోల్పోయాడు. వీరి దూకుడుతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 50 ఓవర్లలో 408/7 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో దీపేశ్ దేవేంద్రన్ (5/22) ధాటికి మలేషియా 93 రన్స్కే కుప్పకూలింది.