న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror) నేపథ్యంలో ఆర్సీబీ మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఇండో-పాక్ క్రికెట్ అంశంపై స్పందించారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలను నిలిపివేయాలని అతను కోరాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐకి లేఖ రాశారు. తన ఎక్స్ అకౌంట్లో ఓ లెటర్‌ను అతను పోస్టు చేశాడు. ఇక పాక్‌తో క్రికెట్ ఆడవద్దు అంటూ పేర్కొన్నాడు. పెహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో లింకున్న అనుబంధ సంస్థకు సంబంధం ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత క్రికెటర్లు ఆడకూడదని పేర్కొన్నాడు.
పాక్ ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, దీని వల్లే తాను పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడవద్దు అని కోరుతున్నట్లు చెప్పాడు. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇండియా ఆ దేశానికి వెళ్లలేదు. తటస్థ వేదికపై మ్యాచ్‌లను ఇండియా ఆడింది. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టవద్దు అని, వాటికి అతీతంగా చూడాలని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారని, పాక్‌లో ఆడేందకు ప్రభుత్వం కానీ బీసీసీఐ కానీ వ్యతిరేకించినప్పుడు గగ్గోలు చేశారని క్రికెటర్ శ్రీవాత్స్ గోస్వామి తెలిపారు. అమాయకులను చంపడం పాకిస్థాన్‌కు జాతీయ క్రీడగా మారిందని ఆరోపించారు.
2012-13 నుంచి పాకిస్థాన్‌తో ఇండియా ద్వైపాక్షిక క్రికెట్ నిర్వహించడంలేదు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నా.. భారత జట్టు మాత్రం పాక్‌లో ఆడలేదు. అయితే కొన్ని రోజుల క్రితమే పెహల్గామ్ వెళ్లానని,ఆ సమయంలో కశ్మర్ లోయలో మళ్లీ శాంతి వికసించినట్లు ఆలోచనలు వచ్చాయన్నారు. కానీ అంతలోనే అక్కడ రక్తపాతం సృష్టించడం ఆందోళనకు గురి చేసిందన్నారు. ఇలాంటి ఘటనలో మనుషుల్ని మార్చేస్తాయని, ఎన్నిసార్లు సైలెంట్‌గా ఉండాలన్న ఆలోచనలు వస్తాయన్నారు. మనవాళ్లు చస్తుంటే క్రీడలా.. ఇక ముందు ఇలాంటివి వద్దు అని శ్రీవాత్స్ గోస్వామి తెలిపారు.
ENOUGH!!!! pic.twitter.com/1fF6XUhgng
— Shreevats goswami (@shreevats1) April 22, 2025