హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తి స్థాయిలో తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
డాటా సెంటర్ల ఏర్పాటుకు 100% గ్రీన్ ఎనర్జీ, విద్యుత్‌ను, డెడికేటెడ్ పవర్ సైప్లె నెట్వర్క్, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్ అభ్యర్థనలు ఉన్నందున ఆయా అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ డాటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతో పాటు అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాటా సెంటర్ల ఏర్పాటునకు పొరుగు రాష్ర్టాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఇస్తున్న రాయితీలపై అధికారులతో సీఎస్ చర్చించారు.