Donald Trump : పశ్చిమాసియా యుద్ధంలో తమకు కొరకుపడని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి హెచ్చరించారు. మంగళవారం రాత్రితో ఇరాన్ నాగరికత(Iran Civilization) మట్టిలో కలుస్తుందని, ఇక మళ్లీ కోలుకునే అవకాశమే లేదని ట్రుత్ పోస్ట్‌లో ఆయన స్పష్టం చేశారు. డెడ్‌లైన్ ముగియడానికి మరికొన్ని గంటలే ఉన్న వేళ ట్రంప్ చివరిసారిగా ఇరాన్‌కు మనసు మార్చుకునే అవకాశమిచ్చారు. రాత్రి 8 గంటల లోపు తలొగ్గితే సరి లేదంటే ఆ దేశ నాగరికత ఆనవాళ్లను తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరికలు చేశారు.
తాత్కాలిక యుద్ధ విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్‌పై శతఘ్నులతో విరుచుకుపడుతున్నాయి. డెడ్‌లైన్‌కు ముగియడానికి ముందే ఖర్గ్ ద్వీపంలోని 50 సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులకు తెగబడ్డాయి. ఈ రోజు రాత్రి మరింత విధ్వంసం సృష్టిస్తామని, ఇరాన్ నాగరికతను నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
𝐃𝐨𝐧𝐚𝐥𝐝 𝐉. 𝐓𝐫𝐮𝐦𝐩 𝐓𝐫𝐮𝐭𝐡 𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐏𝐨𝐬𝐭 𝟎𝟖:𝟎𝟔 𝐀𝐌 𝐄𝐒𝐓 𝟎𝟒.𝟎𝟕.𝟐𝟔 pic.twitter.com/ntXcaNXpg4
— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) April 7, 2026
‘ఈ రోజుతో ఇరాన్ నాగరికత మొత్తం చచ్చిపోనుంది. మళ్లీ ఆ నాగరికతను వెనక్కి తీసుకురాలేరు. అలా జరగాలని నేను అస్సలు కోరుకోను. ఇకపై అదే జరుగనుంది. మేము ఇప్పటికే ఇరాన్లో సంస్థాగత మార్పు తీసుకొచ్చాం. ఆ దేశంలో ఇప్పుడు భిన్నమైన, తెలివైన, అతివాదులు కాని ప్రజలు మాత్రమే ఉంటారు. ఏమో ఎవరికి తెలుసు.. ఈరోజు విప్లవాత్మకమైన, అద్భుతమైన సంఘటనలు ఆవిష్కృతం కానున్నాయి. ప్రపంచ చరిత్రలో ఈరోజు రాత్రి చాలా కీలకమైనది. ఇరాన్లో 47 ఏళ్ల రాక్షస పాలన, అవినీతి ఎట్టకేలకు ఈరోజుతో అంతం కానున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Trump told: “A whole civilization will die tonight”.
You and your allies will suffer an unforgettable hit from the ancient civilization of Iran.
— Iran Embassy SA (@IraninSA) April 7, 2026
యుద్ధం ఆరంభం నుంచి వెనక్కి తగ్గని ఇరాన్ ట్రంప్ హెచ్చరికలకు అదరలేదు. తాము అమెరికా నాగరికతను సర్వనాశనం చేస్తామని టెహ్రాన్ బదులిచ్చింది. ‘ఇరాన్ నాగరికత ఈరోజు చచ్చిపోతుందని ట్రంప్ అంటున్నారు. అయితే.. అతి పురాతనమైన ఇరాన్ నాగరికత నుంచి మీకు, మీ మద్దతుదారులకు మరచిపోలేనటువంటి ఎదురుదెబ్బ తగులుతుంది. ఇది తథ్యం’ అంటూ దక్షిణాఫ్రికాలోని ఇరాన్ దౌత్యకార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.