Shreyas Iyer : సిడ్నీ వన్డేలో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కోలుకుంటున్నాడు. రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న అయ్యర్‌ను.. సోమవారం ఐసీయూ (ICU) నుంచి స్పెషల్ వార్డుకు మార్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే.. అస్పత్రిలోనే మరో రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుందని తెలిపారు. వైస్ కెప్టెన్ అయిన అయ్యర్.. పూర్తిగా కోలుకునేందుకు మూడు వారాలకు పైగా సమయం పట్టనుందని సమాచారం.
‘మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్ అందుకుంటున్న సమయంలో అయ్యర్‌కు గాయమైంది. ఎడమవైపు పొత్తకడుపు కింది భాగంలో అతడి మోచేయి బలంగా తాకింది. దాంతో.. నొప్పితో విలవిల్లాడిన అతడిని ఫిజియో పరీక్షించారు. అయినా అయ్యర్ ఇబ్బందిపడుతూనే ఉండడంతో ఆసల్యం చేయకుండా ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్ పరీక్షల్లో అతడికి ప్లీహం భాగంలో గాయం అయినట్టు గుర్తించాం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. వేగంగా కోలుకుంటున్నాడు. బీసీసీఐ వైద్యబృందం అయ్యర్ అరోగ్యాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తోంది. అతడి ఆరోగ్యంలో రోజూవారీ పురోగతిని గమనించేందుకు టీమిండియా డాక్టర్ సిడ్నీలోనే ఉండనున్నాడు’ అని బీసీసీఐ ఒక ప్రకనటలో వెల్లడించింది. అంతేకాదు అయ్యర్‌కు అండగా కొందరు స్నేహితులు ఉన్నారని.. వీసా ప్రక్రియ పూర్తికాగానే అతడి కుటుంబసభ్యులు కూడా సిడ్నీ చేరుకుంటారని బీసీసీఐ తెలిపింది.
Medical update on Shreyas Iyer. Details 🔽 #TeamIndia | #AUSvIND https://t.co/8LTbv7G1xy
— BCCI (@BCCI) October 27, 2025
మూడో వన్డేలో హర్షిత్ రానా ఓవర్లో అలెక్స్ క్యారీ థర్డ్‌మ్యాన్ దిశలో కొట్టిన బంతిని అయ్యర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టిన అతడు.. ఆ తర్వాత ఎడమవైపు పక్కటెముల నొప్పితో విలవిల్లాడాడు. దాంతో, ఫీజియో వచ్చి పరీక్షించాడు.. అయినా ఉపశమనంగా లేకపోవడంతో అయ్యర్ బాధపడుతూనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అతడికి స్కానింగ్ పరీక్షలు జరిపిన వైద్యలు.. పెద్ద ప్రమాదమేమీ లేదని తేల్చడంతో భారత మేనేజ్మెంట్, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. నవంబర్ ఆఖర్లో దక్షిణాఫ్రికాతో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ లోపు అయ్యర్ కోలుకునే అవకాశముంది. స్వదేశంలో నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6వ తేదీన సఫారీ టీమ్‌తో టీమిండియా తలపడనుంది.
🚨 BIG BREAKING 🚨
– SHREYAS IYER IS IN ICU 🤕 IN SYDNEY AFTER INTERNAL BLEEDING 😨
– SHREYAS IYER’S FAMILY COULD FLY TO SYDNEY SOON, AS BCCI IS MAKING THE ARRANGEMENTS 👏🏻
– Wishing Shreyas Iyer a speedy recovery 🙏🏻 pic.twitter.com/3ssVrhW4Ce
— Richard Kettleborough (@RichKettle07) October 27, 2025