Anil Kumble | టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమయ్యారు. ఇద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. మాజీ కెప్టెన్, కోచ్‌తో భేటీ అయిన విషయాన్ని డీకే శివకుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కుంబ్లే దేశానికి, కర్నాటకకు చేసిన సేవలను ప్రశంసించారు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను తన నివాసంలో కలవడం ఆనందంది. కర్ణాటక, భారత క్రికెట్‌కు అపారమైన సేవలు అదందించారు.
గర్వించదగ్గ కన్నడిగుడితో చర్చల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది’ అంటూ డిప్యూటీ సీఎం పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇందుకు కుంబ్లే ‘మీతో మాట్లాడడం అద్భుతంగా ఉందని.. తనకు సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు’ అని స్పందించాడు. అయితే, ఇద్దరి భేటీకి కారణం తెలియరాలేదు. ఇద్దరి భేటీపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తున్నది. దేశ రాజకీయాల్లోకి రావాలని అనిల్ కుంబ్లేను డీకే శివకుమార్ కోరినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ వార్తలను కుంబ్లే కొట్టిపడేశాడు. ఇది కేవలం వ్యక్తిగత సమావేశం మాత్రమేనని స్పష్టం చేశాడు.