Wimbledon : ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) జోరు కొనసాగుతోంది. ఏడుసార్లు ఇక్కడ విజేతగా నిలిచిన జకో.. మరో అద్భుత విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సోమవారం సెంటర్ కోర్టులో జరిగిన నాలగో రౌండ్ మ్యాచ్‌లో అలెక్స్ డి మినౌర్(ఆస్ట్రేలియా)ను చిత్తుగా ఓడించాడు. తొలి సెట్ కోల్పోయినా ఒత్తిడికి లోనవ్వని జకో.. ఛాంపియన్ ఆటతో ఆసీస్ కుర్రాడికి చెక్ పెట్టాడు. మహిళల విభాగంలో లీడ్మిలా సమ్సోనోవా (రష్యా) క్వార్టర్స్ బెర్తు సాధించింది.
పురుషుల టెన్నిస్‌లో 25 గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్లతో రికార్డు సృష్టించిన జకోవిచ్ మరో ట్రోఫీకి చేరువవుతున్నాడు. సోమవారం సెంటర్ కోర్టులో జకో రాకెట్ వేగానికి ఆస్ట్రేలియా కుర్రాడు అలెక్స్ డి మినౌర్ నిలువలేకపోయాడు. తొలి సెట్లో దూకుడుగా ఆడి 6-1తో మాజీ ఛాంపియన్‌కు షాకిచ్చిన అలెక్స్ ఆ తర్వాతా గట్టిగానే ప్రయత్నించాడు.
Djokovic gets it done 💪
After going a set down against Alex de Minaur, Djokovic recovers to win 1-6, 6-4, 6-4, 6-4 against the Australian and move into his 16th #Wimbledon quarter-finals 😮
There’s just no stopping him ⚡️ pic.twitter.com/mIRU2jjkXF
— Wimbledon (@Wimbledon) July 7, 2025
కానీ, గ్రాస్ కోర్టులో ఎలా ఆడాలో బాగా తెలిసిన జకో.. వరుసగా మూడు సెట్లో అలెక్స్‌కు చుక్కలు చూపించాడు. 6-4, 6-4, 6-4తో గెలుపొంది వరుసగా 16వ సారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. రాయల్ బాక్స్‌లోంచి ఫెదరర్, తన కుటుంబం చూస్తుండగా తనదైన స్టయిల్లో గెలుపు సంబురాలు చేసుకున్నాడీ మాజీ వరల్డ్ నంబర్ వన్. ‘నేను ఆడుతుండగా ఫెదరర్ గ్యాలరీలో కూర్చొని చూడడం ఇదే మొదటిసారి. లక్కీగా నేను ఈ మ్యాచ్‌లో విజయం సాధించాను’ అని జకో మ్యాచ్ అనంతరం తెలిపాడు.
Onto the next ➡️
Liudmila Samsonova advances to the quarter-finals of #Wimbledon after a 7-5, 7-5 victory over Jessica Bouzas Maneiro on No.2 Court ⚡️
Still yet to drop a set at The Championships 2025 👀 pic.twitter.com/0nin6byfnZ
— Wimbledon (@Wimbledon) July 7, 2025
తొలి రౌండ్ నుంచి అదరగొడుతున్న సస్మొనోవా ఉత్కంఠ పోరులో స్పానిష్ ప్లేయర్ జెస్సికా బౌజస్ మనీరోను మట్టికరిపించింది. తొలి సెట్‌ను 7-5తో గెలుపొందిన రష్యా అందం రెండో రౌండ్లోనూ అదే జోరు చూపింది. జెస్సికా గట్టిగానే పోరాడినా చివరకు సస్మొనొవాదే పైచేయి అయింది. రెండో సెట్‌ను కూడా 7-5తో కైవసం చేసుకొని క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.