Dinesh Karthik : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మరో 15 రోజుల్లో షురూ కానుంది. ఈ ఏడాది సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ధోనీతో పాటు మరో భారత స్టార్ ఆటగాడు దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) కూడా గ్‌కు ఈ టీ20 లీగ్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆడతున్న కార్తీక్ 17వ సీజన్‌తో ఈ టోర్నీ నుంచి వైదొలగనున్నాడని సమాచారం. స్రస్తుతం అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
భారత జట్టు తరఫున కొన్ని మ్యాచులే ఆడిన కార్తిక్ ఐపీఎల్ 15వ సీజన్ ప్రదర్శనతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే.. టీ20 వరల్డ్ కప్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత ఐపీఎల్ 16వ సీజన్లోనూ కార్తిక్ దారుణంగా విఫలమయ్యాడు. అనుభవజ్ఞుడైన ఈ స్టార్ ఆటగాడు ఏడో స్థానంలో కీలక పరుగులు చేస్తాడనకుంటే… ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. 13 మ్యాచుల్లో 11.67 సగటుతో 140 రన్స్ కొట్టాడంతే. కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లు మాత్రమే ఆడడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది.
దినేశ్ కార్తీక్
ఐపీఎల్ అరంగేట్రం సీజన్ 2008 నుంచి ప్రతిసీజన్ ఆడిన ఏడో ప్లేయర్‌గా కార్తిక్ రికార్డు నెలకొల్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 250 , రోహిత్ శర్మ(Rohit Sharma) 243 మ్యాచ్‌లు ఆడగా.. కార్తీక్ 242 మ్యాచ్‌లతో మూడో స్థానంలో నిలిచాడు.
అంతేకాదు ధోనీ తర్వాత ఎక్కువ మందిని ఔట్ చేసిన వికెట్ కీపర్ కార్తిక్. ధోనీ 180 మందిని ఔట్ చేయగా.. కార్తీక్ ఖాతాలో 169 డిస్మిసల్స్ ఉన్నాయి. వికెట్ కీపర్ అయిన ఈ రైట్‌హ్యాండర్ ఢిల్లీ, కోల్‌కతా జట్లకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కార్తిక్ ఖాతాలో 4,516 పరుగులు ఉన్నాయి. ఒక ఆటగాడిగా విఫలమైనా కార్తీక్ కామెంటేటర్‌గా విజయవంతమయ్యాడు.