Health Tips | సన్నగా ఉండేవాళ్లు ఆరోగ్యకరంగా లావు అవ్వాలంటే..?
సన్నగా ఉండేవాళ్లు ఆరోగ్యకరంగా లావయ్యే మార్గం ఏదైనా ఉందా? ఎలాంటి ఆహారం తింటే ఈ పద్ధతిలో ఒళ్లు చేస్తారో..తెలియజేయగలరు.
సన్నగా ఉండేవాళ్లు ఆరోగ్యకరంగా లావయ్యే మార్గం ఏదైనా ఉందా? ఎలాంటి ఆహారం తింటే ఈ పద్ధతిలో ఒళ్లు చేస్తారో..తెలియజేయగలరు.
-ఓ పాఠకురాలు
Health Tips | తిని కూర్చుంటే లావు అయిపోవచ్చు అన్నది సరైన ఆలోచన కాదు. లావు కావాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు అన్నదీ ఉత్తిమాటే. తగ్గాలంటే ఎంత నియమంగా ఉండాలో, ఆరోగ్యంగా బరువు పెరగాలన్నా కూడా అంతే శ్రద్ధ అవసరం. ముఖ్యంగా బరువుకు, మనం కనిపించే ఆకారానికి కొన్నిసార్లు సంబంధం ఉండదు. సన్నగా ఉండేవాళ్లు కూడా తగినంత బరువు ఉండి ఉండవచ్చు. వాళ్లలోనూ కొలెస్ట్రాల్ అధికంగా ఉండి ఉండవచ్చు.
అందుకే ముందుగా న్యూట్రిషనిస్టులు… బాడీ కాంపోజిషన్ ఎనాలిసిస్ చేస్తారు. మజిల్ ఫ్యాట్, బోన్ ఫ్యాట్ ఎంత ఉన్నాయి అన్నది తెలుసుకుంటారు. లావు అవ్వడం అంటే కండ పట్టడం. కాబట్టి ఇలాంటి సందర్భంలో మజిల్ మాస్ పెరగాలి. దానికోసం సమతులాహారం, సరైన వ్యాయామం అవసరం. మజిల్ పెరగాలంటే, ప్రొటీన్ అత్యవసరం. ఇందుకు స్మాల్ ఫ్రీక్వెంట్ ఫుడ్… అంటే కొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం చేయాలి.
అందులోనూ ఫ్యాట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పప్పులు, రాజ్మా, చోళె, సోయా, పనీర్, పెరుగు, ఆల్మండ్స్, మష్రూమ్స్లాంటివి తినాలి. మాంసాహారులైతే గుడ్డు, చికెన్ కూడా కలుపుకోవచ్చు. క్యాలరీలు ఎక్కువ ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు దాల్ పరాఠా, పనీర్ పరాఠా లాంటివి తినాలి.
అలాగే రోజూ రెండు కప్పుల పప్పులు తీసుకోవాలి. అలసందలు, శనగలు ఉడికించి సలాడ్‌లా తినొచ్చు. రకరకాల పప్పులు, కూరగాయలు ఉడికించి సూప్‌లాగా చేసుకోవచ్చు. క్వినోవాలో కూడా ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది. నెయ్యి, చీజ్, పీనట్ బటర్‌లలో కూడా ప్రొటీన్ ఎక్కువే. మిల్క్‌షేక్‌లు, పండ్ల రసాలు త్వరగా జీర్ణమై శరీరానికి త్వరగా శక్తినిస్తాయి. కాజు, అరటి పండ్లు.. లాంటివాటిలో తక్కువ పరిమాణంలోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు చేయాలి. న్యూట్రిషనిస్టుని సంప్రదిస్తే శరీర తత్వాన్ని బట్టి డైట్‌ను సూచిస్తారు.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

