న్యూఢిల్లీ : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్పు జరిగింది. గాయం కారణంగా లీగ్‌కు పూర్తిగా దూరమైన బ్రెండన్ కార్స్ స్థానంలో శ్రీలంక పేసర్ దిల్షాన్ మదుశనకకు తీసుకున్నారు. సరిగ్గా లీగ్ ప్రారంభానికి ముందు నెట్ సెషన్లో కార్స్ గాయపడ్డాడు.
దీంతో కార్స్ స్థానాన్ని మదుశనక భర్తీ చేస్తున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. శ్రీలంక తరఫున టెస్టుతో పాటు 28 వన్డేలు, 19 టీ20లు ఆడిన మదుశనకను హైదరాబాద్ రూ.75 లక్షల కనీస ధరకు జట్టులోకి తీసుకుంది.