న్యూఢిల్లీ: ఈ ఒలింపిక్స్‌లో బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ( Boxer Lovlina ) ఇండియాకు ఓ ఊహించని మెడల్ అందించింది. అయితే ఆ మెడల్ తనకు అంత సులువుగా రాలేదని తాజాగా ఆమె చెప్పింది. గత 8 ఏళ్లుగా తాను ఇంటికే వెళ్లలేదని, ఇదే తాను చేసిన అతిపెద్ద త్యాగం అని లవ్లీనా తెలిపింది. ఈ 8 ఏళ్లలో మా కుటుంబానికి ఎన్నో కష్టాలు ఎదురైనా నేను దూరం నుంచే చూశాను తప్ప ఏమీ చేయలేకపోయాను. ఇది చాలా బాధ కలిగించింది. నా వయసులో ఉన్న వాళ్లు చేసే ఎన్నో పనులను నేను త్యాగం చేయాల్సి వచ్చింది.
ఏది పడితే అది తినలేను. శిక్షణ నుంచి తప్పించుకోలేను. ఇలా 8 ఏళ్ల పాటు సాగింది అని లవ్లీనా చెప్పింది. పారిస్ గేమ్స్ కోసం సిద్ధమవుతానని చెబుతున్న ఆమె.. ప్రస్తుతానికైతే కొన్ని రోజులు హాలీడే ఎంజాయ్ చేస్తానని చెబుతోంది. తాను క్వార్టర్ఫైనల్లో తైవాన్ బాక్సర్‌ను ఓడించడం, హైజంప్‌లో ఇద్దరు అథ్లెట్లు గోల్డ్ మెడల్ పంచుకోవడం టోక్యో ఒలింపిక్స్‌లో తనకు అత్యున్నత క్షణాలని ఆమె చెప్పింది.