Neeraj Chopra | భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ 2025 ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ ఈ నెల ఆగస్టు 27, 28 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరుగుతుంది. డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ నీరజ్ ఈ నెల 16న పోలాండ్‌లో జరిగిన సిలేసియా డైమండ్ లీగ్ మీట్లో పాల్గొనలేదు. ఆగస్టు 22న బ్రస్సెల్స్‌లో జరగనున్న తదుపరి డైమండ్ లీగ్‌లోనూ పాల్గొనడం లేదు. అయితే, బ్రస్సెల్స్‌లో పాల్గొంటాడా? అన్నది ఇంకా తెలియలేదు. ఎందుకంటే సైలేసియా స్టేస్ తర్వాత విడుదల చేసిన తాజా స్కోర్ ప్రకారం నీరజ్ డైమండ్ లీగ్‌లో చోటు సంపాదించాడు. నీరజ్ రెండు డైమండ్ లీగ్ మీట్లలో పాల్గొనగా.. 15 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు.
నీరజ్ ఒక దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, మరొక డైమండ్ లీగ్ మీట్లో రెండోస్థానంలో నిలిచాడు. నీరజ్ కంటే 17 పాయింట్లతో కెషోర్న్ వాల్కాట్, 15 పాయింట్లతో జూలియన్ వెబర్ ముందున్నారు. బ్రస్సెల్స్ స్టేజ్ తర్వాత పట్టికలో మొదటి ఆరు స్థానాల్లో ఉన్న అథ్లెట్లు జ్యూరిచ్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్ చివరిసారిగా జూలై 5న బెంగళూరులో జరిగిన నీరజ్ చోప్రా క్లాసిక్‌లో పాల్గొన్నాడు. 86.18 మీటర్లు విసిరి టైటిల్ గెలుచుకున్నాడు. మే నెలలో దోహా డైమండ్ లీగ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 90 మీటర్ల మార్క్‌ను దాటగా.. నీరజ్‌కు ఈ సీజన్ ఇప్పటివరకు చాలా బాగుంది. తన కెరీర్లో అత్యుత్తమ త్రో 90.23 మీటర్లు విసిరి వెబర్ తర్వాత రెండవ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత, జూన్‌లో జరిగిన పారిస్ డైమండ్ లీగ్‌లో నీరజ్ 88.16 మీటర్లు విసిరి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు టోక్యోలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ పాల్గొననున్నాడు.