బెంగళూరు : సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (175 బంతుల్లో 132 నాటౌట్, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ శతకంతో రాణించాడు.
బెంగళూరులోని సీవోఈ గ్రౌండ్స్‌లో గురువారం నుంచి మొదలైన రెండో టెస్టులో జురెల్ మినహా మిగిలిన బ్యాటర్లంతా నిరాశపర్చడంతో తొలిరోజు భారత్ ‘ఏ’ 255 రన్స్‌కు ఆలౌట్ అయింది. కెప్టెన్ రిషభ్ పంత్ (24), కేఎల్ రాహుల్ (19), సుదర్శన్ (17), పడిక్కల్ (5) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో తియాన్ వాన్ వూరెన్ (4/52) నాలుగు వికెట్లు తీశాడు.