MS Dhoni : ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్(CSK) విజయంతో ముగించింది. లీగ్ దశ చివరి పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సేన చెక్ పెట్టింది. అయితే.. ఇప్పుడు అందరి మొదళ్లలో తాలా మరో సీజన్ ఆడతాడా? అనే ప్రశ్నే ఉత్పన్నమవుతోంది. రెగ్యులర్ సారథి రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయంతో తప్పుకోగా.. మళ్లీ పగ్గాలు అందుకున్న మహీ వీడ్కోలుపై మరో నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అంతేకాదు వచ్చే సీజన్‌కు కెప్టెన్ ఎవరు? అనే విషయంపై కూడా స్పందించాడీ లెజెండ్.
గుజరాత్‌పై గెలుపు అనంతరం ధోనీ మాట్లాడుతూ మాట్లాడుతూ సీఎస్కే భవితవ్యం.. వీడ్కోలు విషయాలపై గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఈ సీజన్ మాకు అనుకూలంచలేదు. బ్యాటింగ్ యూనిట్‌గా విఫలయం అయ్యాం. కానీ, ఈరోజు మా కుర్రాళ్లు ఖతర్నాక్ ఆడారు. నా విషయానికొస్తే ఇంకా నాలుగైదు నెలల సమయం ఉంది. రిటైర్మెంట్ నిర్ణయంపై నేను తొందరపడడం లేదు. అలా అనీ నేను మరో సీజన్ ఆడుతాను అనిగానీ, ఆడను అనిగానీ చెప్పలేను.
MS Dhoni wins it for CSK, One Last Time as Captain Cool! 💛✨
Watch #GTvCSK post-match analysis ➡ https://t.co/vroVQLpMts pic.twitter.com/veKp9byViU
— Star Sports (@StarSportsIndia) May 25, 2025
ఎందుకంటే.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. ప్రదర్శనను బట్టే వీడ్కోలు పలకాలి అనుకుంటే.. కొందరు క్రికెటర్ల కెరియర్ 22 ఏళ్లకే ముగుస్తుంది. అందుకే.. నేను హడావిడిగా ఏ నిర్ణయం తీసుకోను. సీజన్ ముగిసింది కాబ్టటి.. రాంచీకి వెళ్తాను. నాకు నచ్చినట్టుగా గడపాలనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన బైక్‌ల మీద చక్కర్లు కొడుతాను’ అని ధోనీ వెల్లడించాడు.
‘తర్వాతి సీజన్లో సీఎస్కే సారథి ఎవరు?’ అనే ప్రశ్నకు ఇంకెవరు రుతురాజ్ ఉన్నాడుగా అని బదులిచ్చాడు ధోనీ. రుతురాజ్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడి గురించి ఆందోళన అవసరం లేదు. వచ్చే సీజన్ గురించి మేము మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. కెప్టెన్‌గా అతుడు సీఎస్కేను మళ్లీ గాడిలో పెడుతాడని నమ్మకం నాకుంది అని మహీ భాయ్ తెలిపాడు. 17వ సీజన్ ముందు కెప్టెన్సీ వదులుకున్న ధోనీ.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేశాడు.
అయితే.. 18వ ఎడిషన్ మధ్యలో గైక్వాడ్ ఎడమచేతి బొటనవేలి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దాంతో, మళ్లీ సీఎస్కే సారథ్యాన్ని చేపట్టిన తాల.. కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతూ జట్టులో స్ఫూర్తి రగిలించాడు. ఈ సీజన్లో ఫినిషర్‌గానూ రాణించిన ధోనీ.. 13 ఇన్నింగ్స్‌ల్లో 196 రన్స్ కొట్టాడు. అందులో 12 ఫోర్లు, 12 వఉన్నాయి.