కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ( Government School ) 1983-84వ సంవత్సరం పదో తరగతి ( Tenth Class ) పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 41 సంవత్సరాలు తర్వాత ఒకచోట కలుసుకున్నారు. పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకుని గత స్మృతులతో ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల వివరాలతో పాటు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను ఒకరినొకరు సంతోషంగా పంచుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల కృషి, ఆశీస్సుల వల్ల తామంత ఉన్నతస్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. నాడు పాటలు బోధించిన గురువులను సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.