Chris Gayle | శ్రీనగర్: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ ఒక ట్రెండ్ సెట్టర్ అని అభివర్ణించాడు. భారత్‌లో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌కు ఆడుతున్న గేల్ మాట్లాడుతూ.. ‘భారత జట్టుకు ధోనీ అత్యంత విజయవంతమైన సారథి. అతడు ఒక ట్రెండ్‌ను సెట్ చేశాడు. అతడి బాటలోనే రోహిత్ శర్మ కూడా తన పాత్రకు తగిన న్యాయం చేస్తున్నాడు. కోహ్లీ కూడా బాగా కెప్టెన్సీ చేశాడు’ అని అన్నాడు.