న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) ఓ స్టన్నింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఇండియా ఏ జట్టుతో 2006లో ఆస్ట్రేలియాలో టూర్ చేస్తున్న సమయంలో.. ప్లేయర్స్ రూమ్‌కు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకువచ్చినట్లు చెప్పాడు. తన ఆటోబయోగ్రఫీలో ఈ విషయాన్ని తెలిపాడు. తాజాగా ఆ బుక్ రిలీజైన విషయం తెలిసిందే. ఫీల్డ్‌లో ఎప్పుడూ సరదాగా ఉండే ఆ క్రికెటర్.. ఎలా తన రూమ్‌కు ఇష్టపడిన అమ్మాయిని తీసుకువచ్చాడో వెల్లడించాడు. రోహిత్ శర్మతో రూమ్ షేర్ చేసుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆస్ట్రేలియా టూర్ సమయంలో ఓ అమ్మాయితో ధావన్ ప్రేమాయణం సాగించాడు. అయితే క్రీజ్‌లో లేనప్పుడు రూమ్‌కు ఆ అమ్మాయిని తీసుకువచ్చేవాడు. ఆ టైంలో రోహిత్ శర్మ కొంత ఇబ్బందికి గురయ్యేవాడట. నిద్ర పోనివ్వవా అంటూ రోహిత్ ఆగ్రహానికి గురయ్యేవాడని శిఖర్ తన బుక్‌లో రాశాడు. డేటింగ్ రిలేషన్ గురించి టీమ్‌లో అందరికీ తెలిసిపోయిందని, దాంట్లో జట్టు సభ్యులు ఆమెను చూసేందుకు వచ్చేవారన్నాడు. చాలా అందంగా ఉంటుందని, సడెన్‌గా లవ్‌లో పడిపోయానని, తాను నా కోసమే పుట్టిందన్న భావన వచ్చిందని, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కూడా ధావన్ తెలిపాడు.
ప్రతి రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ అమ్మాయి వద్దకు వెళ్లి కలిసేవాడినని, ఓ రోజు డిన్నర్‌కు వెళ్తున్న సమయంలో ఆమె రూమ్‌కు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న జట్టు సభ్యులు తన వెంటపడినట్లు ధావన్ తెలిపాడు. చేతుల్లో చేయి వేసి నడుస్తున్న సమయంలో.. సీనియర్ సెలెక్టర్ కూడా ఇద్దర్నీ చూసేసినట్లు గుర్తు చేశాడు.
ఇండియా తరపున ధావన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. వన్డేల్లో ధావన్ 44 సగటుతో 6793 రన్స్ చేశాడు. దాంట్లో 17 సెంచరీలు, 39 ఫిఫ్టీలు ఉన్నాయి. టెస్టుల్లో అతను 2315 రన్స్ చేశాడు. ఏడు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.