Yuzvendra Chahal | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ అంశంలో ఫ్యామిలీ కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ చాహల్, ధనశ్రీ వర్మ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధనశ్రీని చూసిన మీడియా సిబ్బంది ఆమెను చుట్టుముట్టారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఏంటీ బిహేవియర్..? అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ధనశ్రీకి రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు అంగీకరించిన చాహల్..!
చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి విడాకుల అంశానికి సంబంధించి కీలక విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంలో నేడు తుది తీర్పు వెలువడనున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. 2025 ఫిబ్రవరి 5న ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక 2022 నుంచే ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారట. పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలని ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించగా అందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. దీనిని సవాల్ చేస్తూ చాహల్ తరఫు న్యాయవాది హైకోర్టును (Bombay High Court) ఆశ్రయించగా అందుకు న్యాయస్థానం పిటీషన్‌దారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2022 నుంచే విడివిడిగా ఉంటున్నందున మళ్లీ ఆరు నెలల కూలింగ్ పీరియడ్ అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు మార్చి 20 లోపు విడాకుల అంశంపై తుది తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న చాహల్‌ను పెండ్లి చేసుకున్నారు.
Also Read..
“RJ Mahvash | చాహల్, ధనశ్రీ విడాకుల వేళ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మహ్వశ్”
“Dhanashree Verma | విడాకుల రూమర్స్.. చాహల్‌తో ఉన్న ఫొటోలను రీస్టోర్ చేసిన ధనశ్రీ”