Shakib Al Hasan : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ (Shakib Al Hasan) వరుసగా చిక్కుల్లో పడుతున్నాడు. ఇప్పటికే చెక్ బౌన్స్ కేసులో అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నిరుడు డిసెంబర్ నుంచి జట్టుకు దూరమైన అతడు తాజాగా మరోసారి కష్టాల్లో పడ్డాడు. అతడిపై నమోదైన అవినీతి కేసు (Curruption Case)ను విచారిస్తున్న ఢాకా కోర్టు సోమవారం ఈ ఆల్‌రౌండర్‌కు పెద్ద షాకిచ్చింది. సదరు కోర్టు షకీబ్‌పై ట్రావెల్ బ్యాన్ విధించింది. అతడితో పాటు మరో 15 మందికి కూడా ఈ నిషేధం వర్తిస్తుందని న్యాయస్థానం తెలిపింది.
అవినీతి నిరోధక కమిషన్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను విచారించిన ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జ్ ఎండీ. జకీర్ హొస్సేన్ సోమవార తీర్పును వెలువరించారు. స్టాక్ మార్కెట్లో అక్రమంగా కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఇది స్టాక్ మార్కెట్ నియమావళిని షకీబ్ ఉల్లఘించారు.
As long as the share market manipulation allegations are under investigation, Shakib Al Hasan and 15 others are banned from leaving Bangladesh. 🚫
However, the 🇧🇩-cricketer is already residing outside the country.#BangladeshCricket pic.twitter.com/i0ZVEhDXsV
— Cricketangon (@cricketangon) June 16, 2025
దాంతో, ఏసీసీ అతడితో పాటు అతడికి సహకరించిన 15 మందిపై కేసు వేసింది. బంగ్లాదేశ్ టాకాలో 8.97 కోట్లు, 4.48 కోట్ల టాకాలను సేకరించడం ద్వారా సెక్షన్ 19(1)లోని 24(3) రూల్‌ను షకీబ్ అతిక్రమించారని కోర్టుకు విన్నవించింది ఏసీసీ. దాంతో, కోర్టు దేశం విడిచి వెళ్లకుండా అతడిపై ఆంక్షలు విధించింది.
ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడైన షకీబ్ జట్టుకు దూరమై దాదాపు ఏడాది కావొస్తుంది. నిరుడు డిసెంబర్లో భారత్‌పై టెస్టు మ్యాచ్ ఆడిన షకీబ్.. మళ్లీ బంగ్లా జెర్సీ వేసుకోలేదు. అయితే.. టీ20 లీగ్స్‌లో మాత్రం మెరుస్తున్నాడీ ఆల్‌రౌండర్. ఈమధ్యే పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో లాహోర్ కాలెండర్స్కు ప్రాతినిధ్యం వహించాడు.