హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వేదికగా 74వ బీఎన్ మల్లిక్ స్మారక ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పేర్కొన్నారు.
రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి 53 జట్లు రానున్నట్లు తెలిపారు.