Devdutt Padikkal : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు(Team India) ప్రయోగాలకు సిద్ధమవుతోంది. నామమాత్రమైన ఐదో టెస్టులో అయినా ఆడతాడనుకున్న కేఎల్ రాహుల్ (KL Rahul) ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. దాంతో, అతడి స్థానంలో యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal)ను ఆడించాలని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ భావిస్తున్నారు. వరుసగా మూడు టెస్టుల్లో విఫలమైన రజత్ పాటిదార్ స్థానంలో పడిక్కల్ జట్టులోకి వస్తాడని సమాచారం.
అదే జరిగితే ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన నాలుగో భారత ఆటగాడిగా పడిక్కల్ రికార్డు సృష్టిస్తాడు. రాంచీ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్‌లు డెబ్యూ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కుర్రాళ్లు అదరగొడుతున్నారు.అరేంగేట్రం కుర్రాడు ధ్రువ్ జురెల్ రాంచీలో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.
రజత్ పాటిదార్, దేవ్‌దత్ పడిక్కల్
అయితే.. పాటిదార్ మాత్రం తేలిపోయాడు. వరుసగా చాన్స్‌లు ఇచ్చినా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 64 పరగులతో నిరాశపరిచాడు. దాంతో, అతడి స్థానంలో పడిక్కల్‌ను ఆడించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. కర్నాటకకు చెందిన పడిక్కల్ గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో దంచికొడుతున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. దాంతో, ధర్మశాలలో అతడు డెబ్యూ క్యాప్ అందుకోవడం ఖాయమనిపిస్తోంది.