IND A vs England Lions : రెండో అనధికారిక టెస్టులో భారత ఏ జట్టును రెండో రోజు 348కే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ లయన్స్ (England Lions) దీటుగానే బదిలిస్తోంది. ఓపెనర్ టామ్ హైన్స్ (54) మరోసారి అర్ధ శతకంతో చెలరేగి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. లంచ్ తర్వాత ఎంతగా భారత బౌలర్లు ప్రయత్నించినా వికెట్ తీయలేకపోయారు. అయితే.. జిడ్డులా క్రీజులో పాతుకుపోయిన హైన్స్ను ఔట్ చేసి ఇంగ్లండ్ లయన్స్‌కు షాకిచ్చాడు తుషార్ దేశ్‌పాండే.
దాంతో, ఎట్టకేలకు భారత్‌కు బ్రేకిచ్చాడీ పేసర్. టీ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 146 రన్స్ చేసింది. ఇంకా ఆతిథ్య జట్టు 202 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం ఎమిలియో గే(46 నాటౌట్) జోర్డన్ కాక్స్(10 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.
Tushar Deshpande strikes for India A in the 2nd Unofficial Test, dismissing England Lions’ second batter 🏏🔥. England Lions are now 2 down, chasing India A’s total of 348. KL Rahul’s 116 was the standout knock for India A.#IndiaA #EnglandLions #TusharDeshpande #CricketUpdates… pic.twitter.com/thkmjWsBa9
— FOMO7Games (@FOMO7official) June 7, 2025
తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(116) సూపర్ సెంచరీతో చెలరేగగా.. ధ్రువ్ జురెల్(52), కరుణ్ నాయర్(40) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జార్జ్ హిల్ రెండు వికెట్లు పడగొట్టగా.. అభిమన్యు ఈశ్వరన్ బృందం 348 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు యువ పేసర్ అన్షుల్ కంబోజ్ అదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ బెన్ మెక్కిన్నే(12)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించాడు.
29కే మొదటి వికెట్ కోల్పోయిన ఆతిథ్య జట్టును టామ్ హైన్స్(54) ఆదుకున్నాడు. అతడికి ఎమిలియో గే(46 నాటౌట్)తోడవ్వగా ఇద్దరూ కలిసి భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 58 రన్స్ చేసిన ఇంగ్లండ్ లయన్స్.. టీ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 146 రన్స్ కొట్టింది.