INDW vs PAKW :మహిళల వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకపై చెలరేగిన మ్యాచ్‌లో భారత టాపార్డర్ విఫలమైంది. పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేయలేకపోవడంతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించేందుకు మిడిలార్డర్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్ ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్ (46) రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ (32), దీప్తి శర్మ(25)లు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. జట్టు స్కోర్ 230 దాటడమే గగనం అనుకున్న దశలో రీచా ఘోష్(35 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడింది. కానీ, చివరి ఓవర్లో రెండు వికెట్లు పడడంతో భారత్ 247 పరుగులకు ఆలౌటయ్యింది. ఇప్పటివరకూ వన్డేల్లో పదకొండుకు పదకొండు మ్యాచుల్లో ఓడిన దాయాది జట్టు ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే చరిత్ర సృష్టించనుంది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టాపార్డర్ వైఫల్యంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. స్ట్రయిక రొటేట్ చేయలేకపోవడంతో 250లోపే పరిమితమైంది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన(23) కాసేపు అలరించినా పవర్ ప్లేలోనే వెనుదిరిగింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (46), ప్రతీకా రావల్ (31)జట్టు స్కోర్ 60 దాటించారు. అయితే.. జోరు పెంచే క్రమంలో సాదిక్ ఇక్బాల్ వేసిన16వ ఓవర్లో ప్రతీకా బౌల్డ్ అయింది. దాంతో.. 67 వద్ద టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
An Impactful knock 👏
Richa Ghosh’s quick-fire cameo of 35*(20) provided the final flourish to #TeamIndia‘s innings 🚀
Updates ▶ https://t.co/9BNvQl3bfB#WomenInBlue | #CWC25 | @13richaghosh pic.twitter.com/3QngIjfF4J
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
అనంతరం జట్టును ఆదుకోవాలనుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(19)ను డయనా వెనక్కి పంపింది. మూడు వికెట్లు పడిన దశలో జెమీమా రోడ్రిగ్స్ (32), డియోల్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. డయానా ఓవర్లో గ్లోవ్స్ తాకిన బంతిని విక ఎట్ కీపర్ డైవ్ చేస్తూ అందుకుంది. కానీ, అది నో బాల్ కావడంతో జెమీమా బతికిపోయింది. లైఫ్ లభించడంతో ఆచితూచి ఆడిన జెమీమా.. డియోల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగుల రాబట్టింది. 34వ ఓవర్ తర్వాత సిబ్బంది ఒకరు స్ప్రే చల్లేందుకు రావడంతో సుమారు 15 నిమిషాల పాటు ఆటను నిలిపివేశారు అంపైర్లు.
Final 1⃣0⃣ overs coming up!#TeamIndia are 172/5 with Deepti Sharma and Sneh Rana at the crease! 💪
Updates ▶ https://t.co/9BNvQl3bfB#WomenInBlue | #CWC25 | @Deepti_Sharma06 pic.twitter.com/y2j8MFk7UQ
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
రమీమ్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన డియోల్ బౌండరీలైన్ దగ్గర నష్ర క్యాచ్ పట్టడంతో వెనుదిరిగింది. ఆ తర్వాత జెమీమా ఎల్బీగా ఔట్ కావడంతో స్కోర్ నెమ్మదించింది. దీప్తి శర్మ(25), స్నేహ్ రానా (20)లు మరో వికెట్ పడకుండా చూసుకుంటూ స్కోర్ బోర్డును నడిపించారు. అయితే.. 40 వ ఓవర్ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. సనా ఓవర్లో బౌండరీతో రానా స్కోర్ 200 దాటించింది.
కానీ, ఆ తర్వాత బంతిని పెద్ద షాట్ ఆడిన రానా బౌండరీ వద్ద అలియా క్యాచ్ పట్టడంతో ఔటయ్యింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన రీచా ఘోష్ (35 నాటౌట్) సిక్సర్‌తో జోష్ తెచ్చింది. డయాన వేసిన 47వ ఓవర్లో రీచా 4, 6 బాదడంతో స్కోర్ 220 మార్క్‌కు చేరింది. చివరి మూడు ఓవర్లలో క్రాంతి గౌడ్(8) సాయంతో ఆమె 35 పరుగులు పిండుకుంది. అయితే.. చివరి ఓవర్ వరుస బంతుల్లో క్రాంతి, రేణుకా సింగ్ ఔట్ కావడంతో టీమిండియా 247కే ఆలౌటయ్యింది.