WPL 2026 : స్వదేశంలో చెలరేగి ఆడుతున్న టీమిండియా స్టార్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues)కు కీలక పదవి దక్కనుంది. ఇటీవలే వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో అజేయ శతకంతో అదరగొట్టిన ఇకపై కెప్టెన్‌గా మైదానంలోకి దిగనుంది. అవును.. మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నాయకురాలిగా జెమీమా ఎంపిక దాదాపు ఖరారైంది. అయితే.. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఇంకా వెల్లడించలేదు. కానీ, రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడనుందని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది.
భారత మహిళల జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిన జెమీమా రోడ్రిగ్స్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. తాజాగా విశాఖపట్టణంలో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపెడుతూ 69 నాటౌట్‌తో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టింది జెమీమా. టీ20ల్లో అనుభవంతో పాటు ఫామ్‌లోనూ ఉండడంతో జెమీమా కెప్టెన్సీ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్ భావించింది. ఇండియా స్టార్‌కు సారథ్యం అప్పగిస్తున్నట్టు ఢిల్లీ సహ యజమాని పార్త్ జిందాల్ (Parth Jindal) హింట్ ఇచ్చేశాడు.
🚨 BREAKING NEWS 🚨
Jemimah Rodrigues set to be named Delhi Capitals’ captain ahead of WPL 2026 pic.twitter.com/BXQgKrP2SP
— Cricbuzz (@cricbuzz) December 22, 2025
‘మా జట్టకు భారత క్రికెటర్ కెప్టెన్‌గా ఉండాలనే విషయంలో మేము స్పష్టంగా ఉన్నాం’ అని ఢిల్లీలో మెగా వేలం మధ్యలో జిందాల్ చెప్పాడు. దాంతో.. వేలంలో కొన్న లారా వొల్వార్డ్త్ బదులు జెమీమాకే కెప్టెన్సీ ఇస్తారనే వార్తలు వినిపించాయి. సో.. ప్రపంచకప్‌తో జెమీమా దశ తిరిగిందని అంటున్నారు విశ్లేషకులు.
డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున జెమీమా రోడ్రిగ్స్ నిలకడగా రాణిస్తోంది. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాపై అజేయ శతకం(127 నాటౌట్)తో టీమిండియాను గెలిపించింది బ్యాటర్. పేలవ ఫామ్‌తో ఒక మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన తను.. ఆసీస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. మానసిక ఒత్తిడిని జయించి.. తానొక మ్యాచ్ విన్నర్ అని చాటుకుంది. మళ్లీ టచ్‌లోకి వచ్చిన ఈ ఈ స్టార్ ప్లేయర్‌ను డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ కోసం ఢిల్లీ రూ.2.2 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఢిల్లీ విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న జెమీమా ఇప్పటివరకూ 27 మ్యాచుల్లో 139.66 స్ట్రయిక్ రేటుతో 507 పరుగులు చేసింది.
𝗕𝗶𝗴 𝗔𝗻𝗻𝗼𝘂𝗻𝗰𝗲𝗺𝗲𝗻𝘁 𝗔𝗹𝗲𝗿𝘁 💼👀
Coming your way on 23 December, at 6 PM, on @StarSportsIndia and @JioHotstar 📺 pic.twitter.com/Ucuf0OPIe5
— Delhi Capitals (@DelhiCapitals) December 22, 2025
ఢిల్లీ ఫ్రాంచైజీ సోమవారం తమ ఎక్స్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ పెట్టింది. డిసెంబర్ 23 సాయంత్రం 6 గంటలకు బిగ్ అనౌన్స్మెంట్ రానుంది అని క్యాప్షన్ జోడించింది. దాంతో.. జెమీమాను కెప్టెన్‌గా ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని అభిమానులు భావిస్తున్నారు.