లీగ్ దశ చివరికొస్తున్నా కొద్ది ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారుతున్నది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ తమ బెర్తులు ఖరారు చేసుకోగా.. 14 పాయింట్లతో బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. హైదరాబాద్ రేసు నుంచి తప్పుకోగా.. మెరుగైన స్థితిలో నిలిచే అవకాశాలున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై రోహిత్ గ్యాంగ్ నిరాశ పరిచింది. మంచి ఆరంభాలను బ్యాటర్లు భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. బౌలర్లు చివరి వరకు ఒత్తిడి కొనసాగించడంలో విఫలమయ్యారు. ఫలితంగా లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
షార్జా: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తిరిగి ఓటమి బాటపట్టింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలుపొందిన రోహిత్ సేన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. శనివారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. డికాక్ (19), సౌరభ్ తివారి (15), హార్దిక్ (17), కృనాల్ (13 నాటౌట్) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో ఢిల్లీ కూడా తడబడ్డా ఆఖరి ఓవర్లో విజయం సాధించింది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 నాటౌట్) చివరి వరకు అజేయంగా నిలువగా.. పంత్ (26), అశ్విన్ (20 నాటౌట్) విలువైన పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, జయంత్, కృనాల్, బుమ్రా, కౌల్టర్‌నైల్ తలా ఒక వికెట్ తీశారు. అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ముంబై: రోహిత్ (సి) రబడ (బి) అవేశ్ 7, డికాక్ (సి) నోర్జే (బి) అక్షర్ 19, సూర్యకుమార్ (సి) రబడ (బి) అక్షర్ 33, సౌరభ్ (సి) పంత్ (బి) అక్షర్ 15, పొలార్డ్ (బి) నోర్జే 6, హార్దిక్ (బి) అవేశ్ 17, కృనాల్ (నాటౌట్) 13, కౌల్టర్‌నైల్ (బి) అవేశ్ 1, జయంత్ (సి) స్మిత్ (బి) అశ్విన్ 11, బుమ్రా (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 129/8. వికెట్ల పతనం: 1-8, 2-37, 3-68, 4-80, 5-87, 6-109, 7-111, 8-122, బౌలింగ్: నోర్జే 4-1-19-1, అవేశ్ 4-0-15-3, అశ్విన్ 4-0-41-1, రబడ 4-0-33-0, అక్షర్ 4-0-21-3.
ఢిల్లీ: పృథ్వీ షా (ఎల్బీ) కృనాల్ 6, ధవన్ (రనౌట్/పొలార్డ్) 8, స్మిత్ (బి) కౌల్టర్‌నైల్ 9, పంత్ (సి) హార్దిక్ (బి) జయంత్ 26, శ్రేయస్ (నాటౌట్) 33, అక్షర్ (ఎల్బీ) బౌల్ట్ 9, హెట్‌మైర్ (సి) రోహిత్ (బి) బుమ్రా 15, అశ్విన్ (నాటౌట్) 20, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 19.1 ఓవర్లలో 132/6, వికెట్ల పతనం: 1-14, 2-15, 3-30, 4-57, 5-77, 6-93, బౌలింగ్: బౌల్ట్ 4-0-24-1, జయంత్ 4-0-31-1, కృనాల్ 2.1-0-18-1, బుమ్రా 4-0-29-1, కౌల్టర్‌నైల్ 4-0-19-1, పొలార్డ్ 1-0-9-0.