న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్షిప్ నిర్వహణకు పోటీ బాగా పెరిగింది. ఇప్పటికే చెన్నై, సింగపూర్ ఈ రేసులో ఉండగా ఇప్పుడు తాజాగా ఢిల్లీ చేరింది. చెన్నై ఆతిథ్యం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి ఆల్ఇండియా చెస్ ఫెడరేషన్ ఢిల్లీని రేసులోకి దింపింది.
అయితే ఆతిథ్య హక్కుల కోసం ప్రస్తుతం మూడు నగరాలు బిడ్లు దాఖలు చేశాయని అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) సీఈవో ఎమిల్ సుతోవ్స్కీ పేర్కొన్నాడు. ఆయా నగరాల్లో ఉన్న ప్రమాణాలను పరిశీలనలోకి తీసుకుంటూ ఫిడే కౌన్సిల్లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించాడు.