KKR vs DC : పదిహేడో సీజన్లో మరో ప్రతీకార పోరాటానికి కాసేపట్లో తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన ఈ పోరులో ఢిల్లీ సారథి రిషభ్ పంత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. కోల్‌కతా రెండు మార్పులతో ఆడుతుండగా.. పంత్ సేన ఒక్క మార్పు చేసింది. గత మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ ఈసారి లెక్క సరిచేయాలనే కసితో ఉంది.
ఢిల్లీ తుది జట్టు : పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, అభిషేక్ పొరెల్, షాయ్ హోప్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిక్ దార్ సలాం, లిజాడ్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్.
కోల్‌కతా తుది జట్టు : ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అండ్రూ రస్సెల్, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
తొలి విడతలో ఓటముల పర్వాన్ని కొనసాగించిన ఢిల్లీ.. రెండో విడతలో దుమ్మురేపుతోంది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ అంతా క్లిక్ అవ్వడంతో ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కోల్‌కతా టాప్ 2లో ఉండగా ఢిల్లీ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంత్ సేన 12 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకుతుంది. అయితే.. ఇరుజట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఈ పోరులో ఢిల్లీ చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కెప్టెన్ పంత్‌లు విజృంభిస్తే కోల్‌కతా బౌలర్లకు ఇక కష్టాలు తప్పకపోవచ్చు.