ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఇరుజట్లు ఇప్పటి వరకు సీజన్లో ఆడిన తమ మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలవగా, మరొకదాంట్లో ఓడిపోయాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరుజట్లు పటిష్టంగా ఉండటంతో హోరాహోరీ పోరు సాగనుంది. పంజాబ్ టీమ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్, హార్డ్‌హిట్టర్ క్రిస్‌గేల్.. ఢిల్లీ టీమ్‌లో సారథి రిషబ్ పంత్, ఓపెనర్ శిఖర్ ధావన్‌లు రాణించనున్నారు.
టాస్ గెలిచిన ఢిల్లీ సారథి రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తుది జట్టులో ఇద్దరు కొత్త ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, లుక్మాన్ మెరీవాలాకు చోటు కల్పించారు.టామ్ కరన్ స్థానంలో స్టీవ్ స్మిత్, రహానె స్థానంలో మెరీవాలాను తీసుకున్నారు. ఎం అశ్విన్ స్థానంలో జలజ్ సక్సేనాను తుది జట్టుకు ఎంపిక చేసినట్లు పంజాబ్ కెప్టెన్ రాహుల్ పేర్కొన్నాడు.
For the @DelhiCapitals – Steve Smith and Lukman Meriwala receive their caps ahead of Match 11 of #VIVOIPL.#DCvPBKS pic.twitter.com/z3phIF6SJ3
— IndianPremierLeague (@IPL) April 18, 2021
Match 11. Delhi Capitals XI: P Shaw, S Dhawan, S Smith, R Pant, M Stoinis, C Woakes, L Yadav, R Ashwin, K Rabada, A Khan, L Meriwala https://t.co/LYbGVgrfCn #DCvPBKS #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 18, 2021
Match 11. Punjab Kings XI: KL Rahul, M Agarwal, C Gayle, N Pooran, D Hooda, S Khan, J Saxena, J Richardson, M Shami, R Meredith, A Singh https://t.co/LYbGVgrfCn #DCvPBKS #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 18, 2021