ఢిల్లీ: భారత మహిళా జట్టు మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ రాబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు గాను ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా ఎంపికైంది. ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలో ఢిల్లీ ఈ విషయాన్ని వినూత్నంగా వెల్లడించింది. మూడు సీజన్ల పాటు ఢిల్లీని నడిపించిన మెగ్ లానింగ్ స్థానాన్ని జెమీమా భర్తీ చేయనుంది.
డబ్ల్యూపీఎల్ ఆరంభం నుంచీ ఢిల్లీకి ఆడుతున్న ఆమెను ఈ ఏడాది రిటెన్షన్‌లో ఢిల్లీ రూ. 2.2 కోట్లతో నిలుపుకుంది. గతంలో పలుమార్లు ఫైనల్‌కు వచ్చి తుదిమెట్టుపై చేజార్చుకున్న కప్పు కలను జెమీమా నెరవేరుస్తుందని క్యాపిటల్స్ ఆశిస్తున్నది.