IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్‌లను వారం పాటు వాయిదా వేసిన బీసీసీఐ ఆటగాళ్ల భద్రతకు పెద్ద పీట వేస్తోంది. అందులో భాగంగానే ధర్మశాలలో చిక్కుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), పంజాబ్ కింగ్స్(Punjab Kings) క్రికెటర్లను సురక్షితంగా ఢిల్లీకి తరలిస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వందే భారత్ రైలులో భారీ భద్రత నడుమ ప్లేయర్లు, సహాయక సిబ్బంది, అంపైర్లు.. మీడియా బృందం అందరూ ఢిల్లీకి వెళుతున్నారు. టీమ్ హోట్లోలో ఉన్న ఇరుజట్ల ఆటగాళ్లు, సిబ్బందిని శుక్రవారం పోలీసులు గట్టి బందోబస్త్ మధ్య ధర్మశాల నుంచి జలంధర్ రైల్వే స్టేషన్‌కు తరలించామని ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి(Shalini Agnihotri) వెల్లడించింది.
‘శుక్రవారం ఉదయం పంజాబ్, ఢిల్లీ జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది.. బ్రాడ్‌కాస్టింగ్ బృందాన్ని గ్రూప్‌లుగా జలంధర్ తరలించాం. 40 నుంచి 50 చిన్న వ్యాన్లలో భారీ భద్రత నడుమ వీళ్లను పంజాబ్ సరిహద్దులోని హోషియాపూర్‌కు తీసుకొచ్చాం. క్రికెటర్లు, ఇతర సిబ్బందితో కూడిన కాన్వాయ్‌కు కంగ్రా పోలీసులు, పంజాబ్ పోలీసులు రక్షణగా ఉన్నారు. హోషియాపూర్ చేరుకున్నాక ప్లేయర్లను జలంధర్‌కు సురక్షితంగా తరలించాం. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో క్రికెటర్లు వాళ్ల సహాయక సిబ్బందిని ఎక్కించాం’ అని షాలినీ తెలిపింది.
A special train has been arranged to get the Punjab Kings and Delhi Capitals players and support staff from Dharamshala to Delhi after the match on Thursday, May 7 was called off after multiple attacks from Pakistan in various parts of India.
The BCCI has arranged a Vande Bharat… pic.twitter.com/RfbvgBRaol
— IndiaToday (@IndiaToday) May 8, 2025
ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య ధర్మశాలలో గురువారం జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయింది. పంజాబ్ ఇన్నింగ్స్ 10.1 ఓవర్ వద్ద ఫ్లడ్ లైట్స్ పని చేయలేదు. అప్పటికే సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల దాడిని భారత సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోంది. దాంతో, జమ్మూసహా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మ్యాచ్‌ను రద్దు చేసింది. ఆ వెంటనే ఇరుజట్ల ఆటగాళ్లు, సిబ్బందిని భద్రత నడుమ సురక్షితంగా టీమ్ హోట్‌ల్‌కు తరలించిన పోలీసులు.. 20 నిమిషాల్లోనే స్టేడియం మొత్తాన్ని ఖాళీ చేయించారు.
Shalini Agnihotri will be the SP of Kangra#HimachalPradesh #Himachal #Kangra #SP #IPS #news #BreakingNews #LatestNews pic.twitter.com/GuALaTqwgS
— My Himachal News (@myhimachalnews) March 25, 2023