Quinton DeKock : వైజాగ్ వన్డేలో సెంచరీతో మెరిసిన క్వింటన్ డికాక్ (Quinton DeKock ) పలు రికార్డు నెలకొల్పాడు. టీమిండియా తనకు ఇష్టమైన ప్రత్యర్థి అని చాటుతూ ఏడో శతకం బాదేసిన ఈ సఫారీ వికెట్ కీపర్ శ్రీలంకదిగ్గజం సనత్ జయసూర్య (Sanath Jayasuriya) సరసన నిలిచాడు. వైజాగ్‌లో సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం చేసిన డికాక్ 80 బంతుల్లోనే ఈ చిరస్మరణీయ వందకు చేరువయ్యాడు. అయితే.. జయసూర్య 85 ఇన్నింగ్స్‌ల్లో భారత్‌పై ఏడోసారి మూడంకెల స్కోర్ అందుకోగా.. డికాక్ మాత్రం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.
తన పేరులోనే క్విం’టన్’ అని సెంచరీని ఇమడ్చుకున్న ఈ విధ్వంసక ఓపెనర్ వైజాగ్‌లో ఖతర్నాక్ శతకంతో కుమార సంగక్కర (Kumar Sangakkara) రికార్డు సమం చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 23 సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్‌గా సంగక్కర సరసన చేరాడు డికాక్. వీరిద్దరి తర్వత షాయ్ హోప్ 19 శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ లెజెండ్ ఆడం గిల్‌క్రిస్ట్ 16 సెంచరీలు, జోస్ బట్లర్ (ఇంగ్లండ్) 11 సార్లు, ఎబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ(MS Dhoni)లు పదేసి శతకాలు సాధించారు.
Quinton de Kock equals Sanath Jayasuriya for the most hundreds against India in ODIs. 👏🔥#Cricket #DeKock #ODI pic.twitter.com/Z1BTtUq3bk
— Sportskeeda (@Sportskeeda) December 6, 2025
టీమిండియాపై వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డులో డికాక్, జయసూర్య ముందున్నారు. శ్రీలంక వెటరన్ వీడ్కోలు పలకడంతో సఫారీ స్టార్ మరొక వంద కొడితే.. అగ్రస్థానంలో నిలుస్తాడు. దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసక ఆటగాడు ఏబీ డివిలియర్స్ 6 సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మైదానం నలువైపులా షాట్లతో అలరించి.. మిస్టర్ 360గా ఖ్యాతికెక్కిన డివిలియర్స్ భారత్‌పై 32 ఇన్నింగ్స్‌లో శతకాల సిక్సర్ కొట్టాడు.
Quinton de Kock vs India in ODIs:
23 innings
7 💯
2 fifties
Average: 60.94 | SR: 106+Man’s playing cheat code cricket against us 🇮🇳😭
Virat Kohli clapping says it all 🫡#DeKock #INDvSA pic.twitter.com/I3fkkj94QP
— Adarsh (@Adarshkumar_05) December 6, 2025
వన్డేల్లో భారత్‌పై అత్యధిక సెంచరీల జాబితాలో ఆస్ట్రేలియా లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) నాలుగో స్థానంలో నిలిచాడు. పాంటింగ్ 59 ఇన్నింగ్స్‌లో ఇండియాపై ఆరు సెంచరీలు బాదాడు. శ్రీలంక మాజీ ఓపెనర్ కుమార సంగక్కర 71 ఇన్నింగ్స్‌ల్లో ఆరు సెంచరీలు సాధించాడు.