IND vs SA : తొలి టీ20లో 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(90) విధ్వసంక ఆటతో రెండొందలు కొట్టింది. ముల్లనూర్ స్టేడియంలో భారత బౌలర్లను ఉతికేసిన డికాక్ మెరుపు అర్ధ శతకాంతో చెలరేగాడు. సిక్సర్ల మోత మోగించిన అతడిని జితేశ్ శర్మ స్టంపౌట్ చేసి బ్రేకిచ్చాడు. కానీ, ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా(30 నాటౌట్), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. చివరి మూడు ఓవర్లలో ఈ ద్వయం 49 రన్స్ పిండుకోగా నిర్ణీత ఓవర్లలో ప్రొటిస్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.
టాస్ ఓడిన దక్షిణాఫ్రికాకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(90 : 46 బంతుల్లో 5 ఫోర్లు,7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరగాడు. తొలి ఓవర్లోనే సిక్సర్ బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఆ తర్వాత అర్ష్‌దీప్ ఓవర్లో 4, 6తో తన విధ్వంసానికి తెరలేపాడు. మరో ఎండ్‌లో రీజా హెండ్రిక్స్(8), డికాక్ ఇద్దరూ బుమ్రా బౌలింగ్‌లో చెరో సిక్సర్ బాది 16 రన్స్ రాబట్టారు. సఫారీల స్కోర్‌బోర్డును ఉరికిస్తున్న ఈ ద్వయాన్ని వరుణ్ చక్రవర్తి విడదీశాడు.
The visitors bounce back with the bat after their low in the previous game – India have dew for help, but it’s going to take some chasinghttps://t.co/uXWZaLCQy5 | #INDVSA pic.twitter.com/yEgZV7MXr1
— ESPNcricinfo (@ESPNcricinfo) December 11, 2025
హెండ్రిక్స్ ఔటయ్యాక వచ్చిన ఎడెన్ మర్క్రమ్(29) సైతం దూకుడుగా ఆడగా.. 10 ఓవర్లకు స్కోర్ 90కి చేరింది. 26 బంతుల్లోనే అర్ధ శతకం బాదేసి.. సెంచరీకి చేరువైన ను వరుణ్ చక్రవర్తి ఓవర్లో జితేశ్ శర్మ స్టంపౌట్‌గా వెనక్కి పంపాడు. అక్కడితో స్కోర్ వేగం తగ్గిపోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే తిలక్ వర్మ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టగా డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్(14). వెనుదిరిగాడు. అయినా సరే సఫారీ స్కోర్‌బోర్డును ఉరికించారు డొనోవాన్ ఫెరీరా(30 నాటౌట్), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్) వీరిద్దరూ డెత్ ఓవర్లలో బౌండరీల మోతతో స్కోర్ 200 దాటించారు. బుమ్రా వేసిన చివరి ఓవర్లో 18 రన్స్ రావడంతో భారత్‌కు 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ప్రొటిస్ జట్టు.