బెంగళూరు: మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ముందే డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్రేస్ హరీస్ గాయంతో టోర్నీకి దూరమైంది.
ఇటీవలే ఢిల్లీ వేదికగా భారత్‌తో ముగిసిన మూడో వన్డేలో గాయపడ్డ ఆమె.. ప్రపంచకప్‌నకు దూరం కానుంది. హరీస్ స్థానంలో హెథర్ గ్రాహమ్ను ఎంపికచేసినట్టు తెలుస్తున్నది.