బెల్గ్రేడ్(సెర్బియా): ప్రతిష్ఠాత్మక ఏటీపీ ఫైనల్స్ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జొకోవిచ్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా మంగళవారం ప్రకటించాడు. ‘ఏటీపీ టోర్నీలో ఆడేందుకు తొలుత ఆసక్తితో ఎదురుచూశాను. కానీ గాయంతో వారం రోజుల పాటు ఆటకు దూరమయ్యాను. నా ఆటను చూడాలనుకున్న అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను’ అని రాసుకొచ్చాడు. ఈ ఏడాది ఆఖరి టోర్నీ అయిన ఏటీపీ ఫైనల్స్ టోర్నీ ట్యురిన్(ఇటలీ) వేదికగా మొదలుకానుంది